ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోవాలనినిర్ణయించుకున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తనని ఆకట్టుకున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ పూర్తిస్థాయి హామీ ఇచ్చినట్లు సుధీర్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ పరిధిలోని చెరువుల సుందరీకరణతోపాటు బీఎన్ రెడ్డినగర్ రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరంపై హామీ ఇచ్చారన్నారు.
కారెక్కుతున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే - TRS
హస్తం పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. గెలిచిన శాసనసభ్యులంతా కారెక్కేందుకు వరుస కట్టారు. ఇప్పటికే ఆరుగురు గులాబీ కండువా కప్పుకుంటామని నిర్ణయించుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అదే జాబితాలో చేరిపోయారు.
కాంగ్రెస్‌కి మరో షాక్...కారెక్కుతున్న సుధీర్‌రెడ్డి