విజయవాడ రెయిన్బో ఆస్పత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ హాజరయ్యారు. బ్రూణ హత్యలను నివారించటం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఆడపిల్లలు పుడితే కష్టాలు తప్పవన్న భయంతో వారిని గర్భంలోనే చంపేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
'బ్రూణ హత్యల నివారణే ప్రథమ కర్తవ్యం' - ladies
"బ్రూణ హత్యల నివారించి, ఆడపిల్లలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి".. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజని
జస్టీస్ రజని
మహిళలకు ఎన్ని చట్టాలున్నా.. వారికి రక్షణ కల్పించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే అకృత్యాలకు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా అందరూ విశ్లేషించుకుని తమకు ఉన్న చట్టాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.