ఓట్ల తొలగింపుపై 232 ఫిర్యాదులు - intaraugation
ఓట్ల తొలగింపు వివాదంపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 232 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఆర్పీ ఠాకూర్
ఫారం 7 దరఖాస్తుతో ఓట్ల తొలగింపు వివాదానికి సంబంధించిరాష్ట్ర వ్యాప్తంగా 232 ఫిర్యాదులు వచ్చినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. వీటిపైసమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేసినట్టు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఐదుగురిని విచారణ చేస్తున్నట్టు చెప్పారు.