Urlametta Tribals Land Encroachment: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీలకు అడవి మీద హక్కు కల్పిస్తూ.. ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేసిన భూములు కొన్ని చోట్ల సాగుకు నోచుకోలేదు. ఆ భూములకు సర్కారు పట్టాలు ఇచ్చినా.. గతంలో ఆ భూములను సాగు చేసిన స్థానిక రైతులు.. గిరిజనులను పొలాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతోపాటు వారిని చంపేస్తామని మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Endowment Lands: దేవుడి భూములనూ వదల్లేదు.. సొంత ఆస్తిలా రాసిచ్చేస్తున్నారు!
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జి. మాడుగుల మండలం ఉర్లమెట్ట ఆదివాసీలకు.. అటవీ హక్కు చట్టం ప్రకారం 2021లో ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. 157 హెక్టార్ల భూమిని 59 మంది రైతులకు ఇచ్చింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసింది. ప్రభుత్వం ద్వారా పట్టాలు పొందిన తమను పొలాల్లోకి వెళ్లకుండా.. గద్దెరాయి గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుంటున్నారని గిరిజనలు ఆరోపిస్తున్నారు. కప్పట్రాల కొండపైకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నిత్యం 30 నుంచి 40 మంది కొండపైకి ఎక్కి మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పట్టాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవుడికే శఠగోపం.. దేవాదాయ భూమిపై వైఎస్సార్సీపీ నేతల గ'లీజు' దందా..!
అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన తమకు ప్రభుత్వ రైతు భరోసా నిధులు కూడా అందుతున్నాయని గిరిజనులు తెలిపారు. బ్యాంకులు వ్యవసాయ రుణాలు కూడా ఇస్తున్నాయన్నారు. అయినప్పటికీ తమ భూముల్లోకి తాము వెళ్లలేకపోతున్నామని ఉర్లమెట్ట గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నవారే తిరిగి తమపై కేసులు పెడుతున్నారని వాపోయారు. గ్రావిటీ పథకం ద్వారా మంజూరైన వాటర్ ట్యాంకును సైతం కొండపై ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ సమస్యపై స్పందించాలని కోరుతున్నారు. తమ భూముల్లోకి వెళ్లేలా పరిష్కారం చూపించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
Allegations on YCP MLA Dwarampudi: పోర్టు భూముల్ని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారు: కొండబాబు
"2021 సంవత్సరంలో ఈ ప్రాంతంలో అటవీ హక్కుల చట్టం ద్వారా 127 ఎకరాల భూములకు మాకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. వీటికి మాకు రైతు భరోసా నిధులు కూడా అందుతున్నాయి. బ్యాంకులు కూడా మాకు వ్యవసాయ రుణాలు ఇస్తున్నాయి. ఈ భూములపై అన్ని హక్కులూ మావే. అయితే గద్దెరాయి గ్రామానికి చెందిన కొందరు వాటిని ఆక్రమించి.. మమ్మల్ని పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతోపాటు కొండపైకి వస్తే చంపేస్తామని కొందరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిత్యం 30 నుంచి 40 మంది కొండపైకి ఎక్కి మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనివల్ల మా భూముల్లోకి మేము వెళ్లలేకపోతున్నాము. దీంతోపాటు బెదిరింపులకు పాల్పడినవారే మాపై కేసులు బనాయిస్తున్నారు. గ్రావిటీ పథకం ద్వారా మంజూరైన వాటర్ ట్యాంక్‌ను కూడా కొండపై ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై పరిష్కారం చూపించి మా భూముల్లోకి మేము వెళ్లగలిగేలా చేయాలని వేడుకుంటున్నాము." - గిరిజనుల ఆవేదన