ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత హాజరు విధానాన్నే కొనసాగించండి మహాప్రభో: ఆర్టీసీ ఉద్యోగులు

ASPRTC STAFF FACE RECOGNISATION APP ISSUES: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు విధానం (ఫేస్ రికగ్నేషన్) ఆర్టీసీ ఉద్యోగుల్లో కలవరాన్ని పుట్టిస్తోంది. యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండానే హాజరు విధానాన్ని తప్పని సరి చేయడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులకు పని విధానానికి అనుగుణంగా షిప్టులు ఏర్పాటు చేయకపోవడం, పలు లోపాలతో విధులకు హాజరైనా, గైర్హాజరుగానే నమోదు చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి.. తమకు పాత విధానంలోనే హాజరు నమోదు చేయాలని కోరుతున్నారు.

FACE RECOGNISATION
FACE RECOGNISATION

By

Published : Mar 4, 2023, 11:43 AM IST

పాత హాజరు విధానాన్నే కోనసాగించండి మహాప్రభో.. ఆర్టీసీ ఉద్యోగులు

ASPRTC STAFF FACE RECOGNISATION APP ISSUES: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు విధానం ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. యాప్‌లో సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుండానే.. ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని తప్పనిసరి చేయడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పని విధానానికి అనుగుణంగా ఈ వ్యవస్థలో మార్పులు చేయకుండానే ప్రవేశపెట్టడంతో.. విధులకు హాజరైనా, గైర్హాజరుగా చూపుతోందని సిబ్బంది వాపోతున్నారు. పాత విధానంలోనే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అత్యవసర సేవలు అందించే సంస్థల్లో ఆర్టీసీ ఒకటి. నిరంతరం ప్రజలతో మమేకమై పని చేయాల్సి ఉండటంతో అవసరాన్ని బట్టి ఆర్టీసీ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, కంట్రోలర్లది ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా పని విధానం. పని వేళలను బట్టి రకరకాల షిఫ్టులను ఆర్టీసీలో ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్నారు. సిబ్బంది సరిపోని పక్షంలో డబుల్ డ్యూటీలు, అదనపు పని గంటలు కేటాయించడం ఇక్కడ మామూలే. ప్రజలకు నిరంతరం రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. హాజరు పట్టీల్లో సంతకాలు తీసుకోవడం ద్వారా వారికి అదనపు వేతనాలు చెల్లించేవారు. ముఖ ఆధారిత హాజరు యాప్ అమలుతో ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి.

డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందికి అమలు చేసే షిఫ్టులను యాప్‌లో అందుబాటులో లేక గందరగోళం నెలకొంది. కేటాయించిన షిఫ్టులో సకాలానికి విధులకు వచ్చి యాప్‌లో హాజరు వేసినా.. గైర్హాజరుగానే చూపుతోంది. అదనపు పని గంటలు చేసినా.. యాప్‌లో నమోదుకు అవకాశం లేదు. పైగా షిప్ట్‌ సమయాల్లో తేడా ఉందంటూ గైర్హాజరుగా చూపడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పని చేసినా.. అలవెన్స్‌ సొమ్ము రావడం లేదని వాపోతున్నారు. పలుచోట్ల ఇంటర్నెట్ సమస్య కారణంగా హాజరు వేయలేకపోతున్నామంటున్నారు.

మా దగ్గరకి వచ్చే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంతగా చదువుకొనివారు. చాలా మంది సిబ్బంది దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు. ఒకవేళ ఫోను కొనుక్కున్న వాళ్లకి వాడటం రాదు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి అరగంటకోసారి షెడ్యూల్ ఉంటుంది. ఉదహరణకు ఒక సాఫ్ట్ గ్యారెజీ నుంచి రాత్రి 8 గంటలకు డ్యూటీ ఎక్కి, ఉదయం 4 గంటలకు డ్యూటీ దిగాలి. కానీ, యాప్ సమయం రాత్రి 12 గంటలకే ముగించేస్తున్నారు. మరీ డ్యూటీ దిగినవాళ్లు ఎక్కడ హాజరు వేయాలి?, అందుకే ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగిస్తే ఈ సమస్యలు రావు.- శ్రీనివాసరావు, ఎన్‌ఎంయూ కార్యదర్శి

ముఖ ఆధారిత యాప్‌లో పనిచేసే ప్రాంతం సమీపంలోనే హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో గైర్హాజరుగా నమోదు చేస్తోంది. ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు సహా గ్యారేజీ సిబ్బంది ప్రయాణికులకు అవసరమైన సేవలందించడం సహా రిపేర్లు తదితర సమస్యలు పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాలకూ వెళ్తుంటారు. కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది సైతం అధికారిక పనుల నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. వీరు వేరొక ప్రాంతానికి వెళ్లి హాజరు వేస్తే.. గైర్హాజరుగా చూపుతుందంటున్నారు.

ఆన్ డ్యూటీపై వేరొక ప్రాంతానికి వెళ్తే వారు ఏ సమయానికి ఎక్కడికి వెళ్లారు?, ఎక్కడెక్కడ తిరిగారు? అనే పూర్తి రూట్‌ను ప్రధాన కార్యాలయంలోని ఇన్‌చార్జి ముందున్న కంప్యూటర్ తెరపై చూపిస్తోంది. వీటన్నింటికీ ఉన్నతాధికారులకు వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోందంటున్నారు. యాప్‌లో పలు మార్పులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. వీటితోపాటు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు అంతా పదో తరగతి అంతకన్నా తక్కువ విద్యార్హత కల్గిన వారే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడటం రాదు. వీరు యాప్ ద్వారా హాజరు వేసేందుకు అష్ట కష్టాలు పడాల్సి వస్తోందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.

ముఖ ఆధారిత యాప్‌లో మార్పులు చేయడం లేదా పాత విధానాన్నే కొనసాగించాలంటూ ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details