ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రాంతి కుమార్‌ బాగున్నారా?: అల్లూరి జిల్లావాసితో ప్రధాని - అల్లూరి సీతారామరాజు జిల్లా తాజా వార్తలు

Kranti Kumar: ‘క్రాంతి కుమార్‌ బాగున్నారా?’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా వాసిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలకరించారు. దృశ్యశ్రవణ విధానంలో ‘ఉజ్వల భారత్‌-ఉజ్వల భవిష్యత్తు-పవర్‌ 2047’ కార్యక్రమంలో క్రాంతి కుమార్​తో ప్రధాని మోదీ మాట్లాడారు.

Kranti Kumar
అల్లూరి సీతారామరాజు జిల్లా వాసితో ప్రధాని

By

Published : Jul 31, 2022, 9:32 AM IST

Kranti Kumar: ‘ఉజ్వల భారత్‌-ఉజ్వల భవిష్యత్తు-పవర్‌ 2047’ పేరుతో నిర్వహించిన విద్యుత్తు మహోత్సవం శనివారం ఉదయం విశాఖ బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దృశ్యశ్రవణ విధానంలో చింతపల్లి మండలం రత్నగిరి కాలనీకి చెందిన క్రాంతి కుమార్‌తో మాట్లాడారు. ఏపీఈపీడీసీఎల్‌ ఉద్యోగిని ఈ సంభాషణను అనువదించారు. వారి మధ్య సాగిన సంభాషణ ఈ విధంగా ఉంది.

ప్రధానమంత్రి:క్రాంతి కుమార్‌ బాగున్నారా..? చెప్పండి..
క్రాంతి కుమార్‌:నా పేరు క్రాంతి కుమార్‌, మాది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మారుమూల గ్రామమైన రత్నగిరి కాలనీ.

ప్రధానమంత్రి:క్రాంతి విద్యుత్తు రాకముందు.. వచ్చిన తర్వాత ఏం తేడా గమనించారు. అప్పుడెలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది?
క్రాంతి కుమార్‌:మా ఊరిలో విద్యుత్తు సౌకర్యం లేనప్పుడు, రాత్రి పనులు చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. 2017 డిసెంబరులో మా ఊరిలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద విద్యుత్తు వచ్చింది. టీవీలు సమకూర్చుకున్నాం. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి వీలుకుదిరింది. ఇంటి వద్దే మంచినీటి సౌకర్యం పొందుతున్నాం. విద్యుత్తు చాలా ఉపయోగపడుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details