Drainage Canal Collapsed : తెలంగాణలో ఘోర ప్రమాదం తప్పంది. హైదరాబాద్లోని గోషామహల్‌లో చాక్నవాడిలో ఉన్నట్టుండి పెద్ద నాలా పైకప్పు కుంగింది. ఈ ప్రాంతంలో ప్రతి శుక్రవారం మార్కెట్ కొనసాగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే వీధిలో రోడ్డు పక్కన వ్యాపారులు కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా నాలా పైకప్పు కుంగిపోయింది. దీంతో అక్కడే నిల్చున్న కొందరు అందులో పడిపోవటంతో స్వల్ప గాయాలయ్యాయి. మార్కెట్లో విక్రయాలకు తెచ్చిన కూరగాయలు నాలాలో పడిపోయాయి.
కుంగిన నాలా పైకప్పు.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం ఎక్కడంటే ? - రోడ్డపై భారీ గుంత
హైదరాబాద్ గోషామహల్‌లో పెను ప్రమాదం తప్పింది. చాక్నవాడిలో ఉన్నట్టుండి పెద్ద నాలా పైకప్పు కుంగింది. ఈ ప్రాంతంలో ప్రతి శుక్రవారం మార్కెట్ కొనసాగుతూ ఉంటుంది. ఇందులో భాగంగానే వీధిలో రోడ్డు పక్కన వ్యాపారులు కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా నాలా పైకప్పు కుంగిపోయింది. దీంతో అక్కడే నిల్చున్న కొందరు అందులో పడిపోవటంతో స్వల్ప గాయాలయ్యాయి.
గోషామహల్‌లో కుంగిన నాలా
రోడ్డు కుంగిపోయి భారీ గోతి ఏర్పడటంతో పక్కనే ఉన్న వాహనాలు అందులో పడి దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో రద్దీ తక్కువగా ఉండటం, వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి చేరుకుంటున్న అధికారులు.. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి: