పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు - పోలవరం తాజా వార్తలు
Minister Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం తర్వాత ఇంజినీర్లు, ఇతర అధికారులతో అంబటి సమీక్ష నిర్వహిస్తారు.
Ambati: జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. రాత్రే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన అక్కడే బస చేసి.. ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులను పరిశీలిస్తున్నారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఆయా పనుల పురోగతిని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. స్పిల్ వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. మధ్యాహ్నం తర్వాత ఇంజినీర్లు, ఇతర అధికారులతో అంబటి సమీక్ష నిర్వహిస్తారు.