ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బదిలిపార ఎన్​కౌంటర్​పై మావోయిస్టుల ఆడియో టేపు.. ఏమన్నారంటే..! - badilipara encounter

Maoists who released the audio tape : భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కార్యదర్శి రాకేష్ పేరుతో లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు. అందులో భైపరిగూడ బ్లాక్, బదిలిపార వద్ద 10వ తేదీన జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లోఇద్దరు సాధారణ కూలీలను పోలీసులు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని...!ఈ ఘటనపై తక్షణమే నిజనిర్ధారణ చేయాల్సిందిగా, దోషులనుకఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లుగా...ఈ అమానుష చర్యకు నిరసనగా 18వ తేదీన 'మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల బంద్'నుపాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

MAOISTS
MAOISTS

By

Published : Nov 14, 2022, 8:09 PM IST

Maoists released audio tape : భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కార్యదర్శి రాకేష్ పేరుతో లేఖ, ఆడియో టేపు విడుదల చేశారు. భైపరిగూడ బ్లాక్, బదిలిపార వద్ద 10వ తేదీన జరిగిన బూటకపు ఎన్​కౌంటర్​లో ఇద్దరు సాధారణ కూలీలను పోలీసులు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనపై తక్షణమే నిజనిర్ధారణ చేయాలని.. దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ అమానుష చర్యకు నిరసనగా 18వ తేదీన 'మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల బంద్'కు పిలుపునిచ్చారు.

రాకేష్ లేఖ, ఆడియోలోని అంశాలు:

  • 10వ తేదీన బైపర్​గూడ బ్లాక్ అటల్గూడ, మాలిపొదర్, బదిలిపార గ్రామాల మధ్య అటవీ ప్రాంతానికి "కూంబింగ్​కు వెళ్ళిన ఎస్ఓజి పోలీసులపై అర్ధరాత్రి ముందుగా మావోయిస్టులు కాల్పులు జరిపారనీ, ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని, ఘటనా స్థలంలో మూడు కేఫ్ తుపాకులు, తూటాలు, మావోయిస్టుల దుస్తులు, సాహిత్యం, వంటపాత్రలు, గంజాయి మూటలు దొరికాయని" ఫొటోలు, వీడియోలతో పోలీసు అధికారులు అబద్దపు ప్రకటనలు ఇచ్చారు. పైగా 'మావోయిస్టులైతే అక్కడ గంజాయి ఎందుకుంది..? అని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు "మావోయిస్టులకు గంజాయి వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయనీ, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని" నిస్సిగ్గుగా అసత్యాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అక్కడ మావోయిస్టులెవరూ లేరు.
  • అక్కడ చనిపోయినవాళ్ళలో మథిలి బ్లాక్ సరిగూడ గ్రామానికి చెందిన ధోనో కమర్తో పాటు, మరొక సాధారణ కూలీ ఉన్నాడు. వీరు తమ బ్రతుకుదెరువు కోసం గంజాయి వ్యాపారుల వద్ద కూలీ కోసం మూటలు తరలించే సాధారణ పేద కూలీలు. రాత్రిపూట అడవిలో మకాంలు వేస్తుంటారు.
  • పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి, చంపి తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మావోయిస్టులపై కాల్పులు జరిపామని బూటకపు ప్రచారం చేస్తున్నారు. పోలీసులు విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తే అది ఎంత బూటకమో ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంఘటనా స్థలంలో పెట్టడానికి.. పోలీసులు ఎప్పుడూ మావోయిస్టుల దుస్తులు, వైర్లు, సాహిత్యం. తుపాకులు సిద్ధంగా పెట్టుకున్నట్టే.. ఈ సారి కూడా పోలీసులు వాటన్నింటిని ఆ ఘటనా స్థలంలో పెట్టారు. అక్కడ దొరికిన చెప్పులు, వంట పాత్రలు చూస్తే అవి మాత్రమే పేద కూలీలవని అర్థమవుతుంది. మిగతావన్నీ పోలీసులు సృష్టించినవే.
  • అక్కడ దొరికాయని చెబుతున్న కేఫ్ తుపాకులతో తూటాలను ఎలా పేలుస్తారో పోలీసులే చెప్పాలి. మావోయిస్టులను మొత్తం నిర్మూలించామనీ, పోలీసులు విజయం సాధిస్తున్నారని చెప్పుకోవడానికి కటాఫ్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో నకిలీ డంపులను సృష్టించడం, బూటకపు లొంగుబాట్లు చేయించడంతోపాటు, ఇక ఇప్పుడు సాధారణ ప్రజలను చంపి మావోయిస్టులను చంపామని ప్రచారం చేయడం జరుగుతుంది.
  • అయితే ఇది మొదటి ఘటనేమీ కాదు. గతంలో కూడా లన్తపుట్ ప్రాంతంలో గున్నయ్పడ, లిటిపుట్ వద్ద రాత్రివేళలో పీతలు పట్టుకోవడానికి వెళ్ళిన రైతులపై పోలీసులు కాల్పులు జరిపితే.. గంగాధర్ కిర్సానీ అనే రైతు చనిపోయాడు. చిత్రకొండ బ్లాక్​లో ఈతలపాడు అనే గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులు రాత్రిపూట వేటకు వెళితే వీరిపై జరిపిన కాల్పుల్లో సోని అనే రైతు చనిపోయాడు, కదువాం గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో బృందా అనే మహిళా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి న్యాయవిచారణ జరపలేదు. దోషులను శిక్షించలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వలేదు.
  • సాధారణ ప్రజల ప్రాణాలకు ఏ మాత్రం విలువనీయకుండా అత్యంత అమానుషంగా కాల్చి చంపుతున్న పోలీసులు చర్యలకు అధికార బీజేడీ పార్టీ బాధ్యత వహించాలి. 10వ తేదీన జరిగిన బూటకపు ఎన్​కౌంటర్​పై తక్షణమే న్యాయ విచారణ జరపాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి. కూంబింగ్ పేరుతో ఆదివాసీ ప్రాంతాలలో ప్రజలపై పోలీసులు జరుపుతున్న హత్యలనూ, అమానుష చర్యలను తీవ్రంగా ఖండించాల్సిందిగా, బాధిత కుటుంబాలకు మద్దతునివ్వాల్సిందిగా ప్రజలకూ, ప్రజాస్వామికవాదులకూ, విద్యార్థులకూ, మేధావులకు పిలుపునిస్తున్నాం. బదిలీపార ఘటనకు నిరసనగా ఈనెల 18వ తేదీన 'మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల బంద్ 'ను పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details