Polavaram project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన తహసీల్దారు వీర్రాజు గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం కోర్టులో లొంగిపోయారు. దేవీపట్నం తహసీల్దారుగా పనిచేసిన వీర్రాజుతోపాటు వీఆర్వో సత్తార్‌లపై ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్ వేటువేసింది. వీరితోపాటు మరో ఏడుగురిపై దేవీపట్నం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దేవీపట్నం మండలం గుబ్బలంపాలెంలో నిర్వాసిత గిరిజన రైతులకు భూ పరిహారం పంపిణీలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారు. గుబ్బలంపాలెంలో కొత్త సర్వే నంబర్లు సృష్టించి రూ.2.24 కోట్లు కాజేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి స్థానిక ఐటీడీఏ ఎదుట గతంలో ఐదురోజులపాటు నిర్వాసితులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తహసీల్దారుగా పనిచేస్తున్న వీర్రాజు, వీఆర్వో సత్తార్‌లను సస్పెండ్ చేశారు. వీరితోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు వారెంట్ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం తహసీల్దారు కోర్టులో లొంగిపోయారు. జులై 7 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
పోలవరం పరిహారంలో అక్రమాల కేసు: కోర్టులో లొంగిపోయిన తహసీల్దారు - పోలవరం ప్రాజెక్టు
Polavaram project: పోలవరం నిర్వాసితులకు పరిహారంలో అక్రమాల కేసులో దేవీపట్నం తహసీల్దార్ న్యాయస్థానంలో లొంగిపోయారు. వీర్రాజుకు జులై 7 వరకు కోర్టు రిమాండ్ విధించింది. గుబ్బలంపాలెంలో కొత్త సర్వే నంబర్లు సృష్టించి రూ.2.24 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదు రావడంతో పలువురు రెవెన్యూ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసింది.
పోలవరం