న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌ను విజయంతో ముగించింది భారత జట్టు. చివరిదైన ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. 4-1తో సిరీస్ కైవసం చేసుకుని ఆతిథ్య జట్టుపై తిరగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా న్యూజిలాండ్ ముందు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ 217 పరుగులకే చేతులెత్తేసింది.
మొదటి నుంచి తడబడిన కివీస్
253 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్ షమీ బౌలింగ్‌లో జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 19 బంతుల్లో 24 పరుగుల చేసి దూకుడు మీదున్న మన్రోను షమీ బౌల్డ్ చేశాడు. సిరీస్ మొత్తం ఫామ్‌లో ఉన్న రాస్ టేలర్ ఒక్క పరుగు మాత్రమే చేసి పాండ్యాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 37 పరగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది కివీస్.
లాథమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్న చేశాడు కెప్టెన్ విలియమ్సన్. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో కుదురుకుంటోన్న ఈ జోడీని కేదార్ జాదవ్ విడదీశాడు. 39 పరుగులు చేసిన విలియమ్సన్‌ను 26వ ఓవర్లలో ఔట్ చేశాడు. కొద్ది సేపటికే టామ్ లాథమ్(37), గ్రాండ్‌హోమ్(11)లను చాహల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. 31 ఓవర్లలో 135పరుగులకే ఆరు వికెట్లను నష్టపోయింది న్యూజిలాండ్. ఇక్కడే భారత్ విజయం దాదాపు ఖరారైంది.