ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

భారత్‌@ 4 - smriti mandana

మహిళా టీ20 ర్యాంకింగ్స్ ని ఐసీసీ ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ 4వ స్థానంతో సరిపెట్టుకుంది.

మహిళా టీ20 ర్యాంకింగ్స్

By

Published : Feb 12, 2019, 8:51 PM IST

Updated : Feb 13, 2019, 10:33 AM IST

భారత బ్యాట్స్ ఉమెన్ స్మృతీ మందనా, రోడ్రిగేజ్ ఐసీసీ ర్యాంకుల్లో మెరుగయ్యారు. తాజాగా విడుదల చేసిన ట్వీ20 ర్యాంకుల్లో రోడ్రిగేజ్ 2వ స్థానంలో నిలవగా, స్మృతీ ఆరో స్థానానికి ఎగబాకింది.

న్యూజిలాండ్ సిరీస్​లో జట్టు విఫలమైనా తమ బ్యాటింగ్​తో స్మృతి, రోడ్రిగేజ్ ఆకట్టుకున్నారు. సిరీస్​లో 132 పరుగులు చేసి రోడ్రిగేజ్ రెండో స్థానానికి చేరింది. గత వారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో మొదటి స్థానాన్ని సాధించిన స్మృతి.. టీ20ల్లోనూ నాలుగు స్థానాలు ముందుకు జరిగి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాధా యాదవ్ 18 స్థానాలు ఎగబాకి 10 స్థానానికి చేరింది. ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని దీప్తి శర్మ 14వ స్థానం వద్ద స్థిరపడింది.
టీం ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా జట్టు మెదటి స్థానంలో ఉండగా, భారత్ 4వ స్థానంలో నిలిచింది.

Last Updated : Feb 13, 2019, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details