కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ జట్టు గెలుపులో తనవంతు పాత్ర పోషిస్తున్న అంబటి రాయుడు ప్రపంచ కప్లో ఏ స్థానంలో ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందరి కళ్లు నాలుగో స్థానం మీదే. ఈ స్థానం కోసం రాయుడుతో పాటు కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, మనీష్ పాండే పోటీపడుతున్నారు. న్యూజిలాండ్తో చివరి వన్డేలో 90 బంతుల్లో 115 పరుగులతో ఆకట్టుకున్న రాయుడే సరైనవాడని విశ్లేషకుల అభిప్రాయం.
ప్రపంచకప్లో నాలుగోస్థానంలో రాయుడు..! - ambati rayudu
న్యూజిలాండ్ సిరీస్ లో ఆకట్టుకున్న అంబటిరాయుడు నాలుగో స్థానంలో ఆడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
అంబటిరాయుడు
న్యూజిలాండ్ సిరీస్లో 63.33 సగటుతో 190 పరుగులు చేసిన రాయుడు.. అంతకుముందు ఆసియా కప్లో 43.75 సగటుతో 175 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
మే 30న ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఉన్న జట్టులో కేవలం నాలుగో స్థానం పైనే ఆసక్తి నెలకొంది. మరి ఆ స్థానం రాయుడును వరిస్తుందో లేక మరో ఆటగాడి వశం అవుతుందో వేచి చూడాలి.