'ధోనీని చూసి నేర్చుకుంటున్నా' - dhoni
ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నానని విజయ్‌శంకర్ అన్నాడు.
లక్ష్యాన్ని ఎలా ఛేదించాలో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి నేర్చుకుంటున్నాని చెప్పాడు భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో మెరుగైన ప్రదర్శన ద్వారా ప్రపంచ కప్ జట్టులో అతన్ని ఎంపిక చేసే అవశాలున్నాయని సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం సంకేతాలిచ్చారు.
తన అనుభవాలను, అభిప్రాయాలను చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకున్నాడీ ఆల్‌రౌండర్. సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్ షేర్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాని అన్నాడు.
మరిన్ని పరుగులు చేయాల్సింది...
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ- ట్వంటీ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినందుకు ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో 43 పరుగులతో ఆకట్టుకున్నాడు శంకర్. అయితే తాను మరిన్ని పరుగులు చేసి ఉండాల్సిందన్నాడు. లక్ష్యం చేరువయ్యే దాకా అన్నా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాని స్పష్టం చేశాడు ఈ తమిళనాడు క్రికెటర్.