గోపన్నపాలెంలో గోవిందా...! - జబర్దస్త్ నటుడు అవినాష్
పశ్చిమగోదావరి జిల్లాలో అచ్చమ్మ పేరంటాల తల్లిని వజ్రకవచధర గోవిందా చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు.
గోపన్నపాలెంలో వజ్రకవచధర గోవిందా చిత్ర యూనిట్ సందడి
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని అచ్చమ్మ పేరంటాల తల్లిని వజ్రకవచధర గోవిందా చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. హీరో సప్తగిరి, హీరోయిన్ అర్చన, నిర్మాత డి.బి.యన్.రెడ్డి, దర్శకుడు అరుణ్ పవర్, జబర్దస్త్ నటుడు అవినాష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బికు మించి మెరుగైన వినోదాన్ని ఈ చిత్రంలో అందిస్తున్నట్లు హీరో సప్తగిరి తెలిపారు. అనంతరం చిత్ర యూనిట్ను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.