ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

స్వేచ్ఛే మంత్రం:రెహమాన్​ - స్లమ్​ డాగ్​ మిలీనియర్

ఏఆర్​ రెహమన్​పై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్​ విపరీతంగా వచ్చాయి. దీనికి కారణం రెహమాన్​తో తన కుమార్తె ఖతిజా బుర్ఖా ధరించి కనపడటమే.

వేడుకలో బుర్ఖా ధరించిన రెహమాన్​ కూతరు ఖతిజా

By

Published : Feb 10, 2019, 8:46 PM IST

స్వర మాంత్రికుడు రెహమాన్‌ ఆస్కార్‌ అవార్డు సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఓ వేడుక నిర్వహించింది 'స్లమ్​ డాగ్​ మిలీనియర్'​ చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో రెహమాన్, ఖతీజాల భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఖతీజా బుర్ఖాలో రావడంతో కొంతమంది విమర్శనాస్త్రాలు సంధించారు. రెహమాన్‌ సంకుచిత స్వభావం కలవాడని, బుర్ఖా ధరించాలని కూతురిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు.

  • గతంలో ఈమె చీరతో ముఖాన్ని కప్పుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ విమర్శకులు కామెంట్లు పెడుతున్నారు. పిల్లలకు రెహమాన్​ స్వేచ్ఛనివ్వట్లేదని, దుస్తుల విషయంలోనూ నిబంధనలు పెడుతున్నాడని దుమ్మెత్తిపోశారు.
    రెహమాన్​ పిల్లలు- రహీమా, ఖతిజా, అమీన్​

తనపై ఆరోపణలు చేసిన వారందరికీ బుద్ధి చెప్పేందుకు రెహమాన్​ కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. వాటిలో తన కుటుంబసభ్యులు వివిధ రకాల దుస్తుల్లో నీతా అంబానీ పక్కన కనిపించారు. నేను స్వేచ్ఛగా ఉండేలా ప్రోత్సహిస్తానో లేదో ఈ ఫోటో చూస్తే అయినా అర్థం అయ్యిందా...అంటూ విమర్శకులకు చురకలు అంటించాడు.

  • తన తండ్రిని విమర్శించడంపై ఖతిజా ఫేస్​బుక్​ ద్వారా తన మనసులో మాటను వెల్లడించింది.
    ఫేస్​బుక్​లో మనసులో మాటను వెల్లడించిన ఖతిజా

'నేను ఎటువంటి దుస్తులు ధరించాలి, ఎలా ఉండాలనేది నేను నిర్ణయించుకోగలను. బుర్ఖా ధరించడాన్ని ఇష్టపడతా. నా గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోలేనంత చిన్నపిల్లను కాను. నా తల్లిదండ్రులు ఎంత స్వేచ్ఛ ఇస్తారో నాకు తెలుసు. మీ అభిప్రాయాలు, ఊహాగానాలు మా కుటుంబం మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఏదైనా మాట్లాడేముందు నిజాలు తెలుసుకోండి' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details