ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

ఎన్టీఆర్​ ఆదేశించారు...నేను ఆచరిస్తాను: రామ్​గోపాల్ వర్మ​ - ntr mahanayakudu

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ విడుదల తేదీ తరవాతే తన సినిమా విడుదల ఉంటుదని తెలిపారు. ఇలా చేయమని స్వయంగా ఎన్టీఆర్‌ స్వర్గం నుంచి చెప్పారని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

ఎన్టీఆర్​ ఆదేశించారు...నేను ఆచరిస్తాను: రామ్​గోపాల్ వర్మ​

By

Published : Feb 3, 2019, 2:00 PM IST

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మోషన్​ పోటో, రెండు పాటలను విడుదల చేసి ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వెల్లడిస్తానని వర్మ ట్వీట్టర్లో వెల్లడించారు.

ఇలా చేయమని స్వయంగా ఎన్టీఆర్‌ స్వర్గం నుంచి తనను హెచ్చరించారని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌ ఆశీర్వాదాలు తన సినిమాకు ఉన్నాయని చెప్పారు.

ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో సన్నివేశం
ఎన్టీఆర్‌ పాత్రను పశ్చిమ గోదావరికి చెందిన రంగస్థల నటుడు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడు కల్యాణి‌ మాలిక్‌ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఇందులోని ఓ పాటను వ్యతిరేకిస్తూ తెదేపా నాయకులు ఆందోళనలూ చేశారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో రాజకీయంపై చర్చ
ఇటీవల ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి, నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ పాత్రల లుక్‌లను వర్మ విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను కూడా వర్మ తరచూ షేర్‌ చేస్తూ ఉన్నారు.
ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details