ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

మిషన్ ఇన్ 2021-22 - tom

టామ్ క్రూజ్ నటిస్తున్న మిషన్ ఇంపాజిబుల్ సీక్వెల్స్ త్వరలో విడుదలకానున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ 7వ భాగాన్ని జులై 23,2021లో విడుదల అవుతుండగా, 2022 ఆగస్టు 5న 8 వభాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మిషన్ ఇంపాజిబుల్ సీక్వెల్స్

By

Published : Feb 3, 2019, 6:31 AM IST

మీరు హెలీకాప్టర్​లో అమాంతం దూకే హీరోని చూశారా! ఎత్తున్న భవనాలను ఒక దానిపై నుంచి మరోక దానిపైకి దూకుతూ విలన్లను వెంటాడే సన్నివేశాన్ని వీక్షించారా!అయితే బీకర యాక్షన్ సీన్లను చూడటానికి సిద్ధమవ్వండి... టామ్ క్రూజ్ నటిస్తున్న మిషన్ ఇంపాజిబుల్ సీక్వెల్స్ త్వరలో విడుదలకానున్నాయి.
పారామౌంట్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిక్వేల్స్​కు టామ్​క్రూజ్ తానే కథను అందిస్తున్నాడు. మిషన్ ఇంపాజిబుల్ 7వ భాగాన్ని 2021 జులై 23లో విడుదల అవుతుండగా, 2022 ఆగస్టు 5న 8 వభాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. 2018లో విడుదలైన 'మిషన్ ఇంపాజిబుల్ ఫాల్​ఔట్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్ల్ సాధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
టామ్ క్రూజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాలకు క్రిస్టోఫర్ మెక్ క్వర్రీ దర్శకుడిగా వ్యవహారిస్తున్నారు. గత మూడు ఇంజిబుల్ చిత్రాలకు నిర్మించిన డేవిడ్ ఎల్లిసన్ ఈ సిక్వేల్స్​నీ రూపొందిస్తున్నాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details