ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

"అల వైకుంఠపురంలో" సినిమా మ్యూజికల్​ నైట్​పై కేసు!

నిబంధనలకు విరుద్ధంగా.. "అల వైకుంఠపురంలో" సినిమా మ్యూజికల్​ నైట్​ నిర్వహించారంటూ.. హైదారాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్​లో కేసు నమోదైంది. కార్యక్రమానికి 6 వేల మందికి గాను 15 వేల మందిని ఆహ్వానించిన కారణంగానే కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది.

By

Published : Jan 9, 2020, 7:11 PM IST

case filed on Ala Vaikunthapurramuloo musical night
"అల వైకుంఠపురంలో" సినిమా మ్యూజికల్​ నైట్​ పై జూబ్లీహిల్స్​లో కేసు

అల వైకుఠపురంలో.. చిత్ర మ్యూజికల్ నైట్ వేడుకపై వివాదం ఏర్పడింది. గడువు ముగిసినా కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ.. శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్​తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ యగ్నేష్ పై హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఈ నెల 6న సాయంత్రం యూసుఫ్​గూడ బెటాలియన్ పోలీస్ గ్రౌండ్​లో 'అల వైకుంఠపురంలో' సినిమా మ్యూజికల్ నైట్ ఫంక్షన్ నిర్వహించారు. కార్యక్రమం నిమిత్తం ఈ నెల 2న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ కె. యగ్నేష్ పోలీసుల అనుమతి తీసుకున్నారు. దాదాపు 5 నుంచి 6వేల మంది హాజరవుతారని రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం ముగుస్తుందని లేఖలో పేర్కొన్నారు.

రాత్రి 11:30 గంటల వరకు కార్యక్రమం నిర్వహించారు. గంటన్నర అదనంగా కొనసాగించడమే కాకుండా పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో ఆరువేల మందికి మాత్రమే పాస్​ ఇచ్చామని పేర్కొన్నారు. కానీ.. 15 వేల మందిని ఆహ్వానించినట్లు గుర్తించారు.

ఇవీ చూడండి:

దర్బార్ క్రేజ్​: చెన్నైలో ఫ్యాన్స్ రచ్చ.. రచ్చ

ABOUT THE AUTHOR

...view details