ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / science-and-technology

'ఆ మరణాలకు కారణం మనిషే'

జీవులు అంతరించడానికి మానవుడే ప్రధాన కారణమవుతున్నాడని జీవ శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రాణుల మరణాలు

By

Published : Feb 12, 2019, 8:59 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

"వంద గ్రాముల బరువున్న ఓ జీవి మనతో కలిసి బతకలేకపోతే... మనకింత సాంకేతికత ఎందుకు" తెలుగు సినిమా డైలాగ్​లా అనిపించినా ఇది నిజం.. భూమిపై నివసించే సకశేరుకాల్లో(వెన్నెముక గల జంతువులు) 25శాతం మానవ తప్పిదం వల్ల మరణిస్తున్నాయని తాజా సర్వేలో తేలింది. వెయ్యికి పైగా నివేదికలను పరిశీలించి, 42వేల 755 జీవుల మరణాలను విశ్లేషించింది అమెరికా వ్యవసాయ విభాగం.

"35వేల జాతులున్న ఈ భూమండలంలో కేవలం ఓ వర్గానికి చెందిన మానవుల వల్లే ఇంత నష్టం సంభవిస్తోంది. దీనికి మనమందరం బాధ్యత వహించాల్సి ఉంది. పట్టణీకరణ వల్ల భూమిని మానవులు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది".
- జేరాల్డ్ ఎల్. బెలాండ్, నివేదిక సహరచయిత

మానవ తప్పిదం వల్ల కలిగే ప్రభావం జాతుల బట్టి మారుతోంది. చిన్న చిన్న జంతు జాతుల కన్నా పెద్ద వర్గాల జీవులే మారణ హోమానికి గురవుతున్నాయి.
-జాకోబ్ హిల్, సహరచయిత

మానవుల ప్రత్యక్ష చర్యల వల్ల 28శాతం మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయని ప్రపంచ జీవవారణ శాస్త్ర జర్నల్​లో ప్రచురితమైంది. మిగిలిన 72 శాతం సహజమరణం పొందుతున్నాయి. జీవులు అంతరించపోవడానికి మానవుడే ప్రధాన కారకుడు అవుతున్నాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details