ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

మట్టిళ్లు.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా - సొంతిళ్లు

సొంత ఇల్లు.. ఎంతోమంది కల. దీని కోసం ఎంతో ఖర్చుపెడుతుంటారు. ఆకర్షించే రంగులు, సామాగ్రి, ఫర్నిచర్‌తో అలంకరించేస్తారు. అంత పొందికగా కట్టుకున్నది మన ఆయువుకే ప్రమాదమైతే? ఇదే ఆలోచనొచ్చింది షగున్‌ సింగ్‌కి! దీంతో ఎంఎన్‌సీ ఉద్యోగానికి స్వస్తి చెప్పి మరీ పర్యావరణహిత ఇళ్లపై దృష్టిపెట్టింది.

eco friendly homes
మట్టిళ్లు.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా

By

Published : Jun 5, 2021, 7:30 PM IST

పర్యావరణహిత ఇళ్లకోసం(Eco-friendly homes ) షగున్ సింగ్​ దృష్టిపెట్టింది. తక్కువ ఖర్చులో... ఎన్నో ఏళ్లు మన్నికంగా ఉండేలా నిర్మించాలనుకుంది. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. వ్యవసాయ వ్యర్థాలు, మట్టి, ఆవుపేడ, లైమ్‌లతో వీటిని నిర్మిస్తోంది.


ఈ ఇళ్లు స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు భూకంపాలకూ దీటుగా నిలుస్తున్నాయట. ఇందుకోసం ఎర్త్‌ బ్యాగ్‌ అనే ప్రత్యేక టెక్నిక్‌ను ఉపయోగించడమే ఇందుకు కారణం.

‘గీలీ మట్టి’ పేరిట ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి నిర్మాణంతోపాటు ఏటా 120 మందిని ఎంపిక చేసి తయారీలో శిక్షణనూ ఇస్తోంది.

వీటిని చూడాలనుందా? అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ దగ్గర మహ్రోరా గ్రామానికి వెళ్లాల్సిందే.

అన్నట్టూ ఆధునిక సౌకర్యాలన్నీ వీటిలోనూ ఉంటాయి. రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయి.

ఇదీ చూడండి:

'భూమిని పచ్చగా ఉంచే ప్రయత్నం చేద్దాం'

ABOUT THE AUTHOR

...view details