తెలంగాణలోని నిజామాబాద్ నగరంలో.. ఓ శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశారు... అక్కడి స్థానికులు. బోయిగల్లీలో గత కొంత కాలంగా ఓ కుక్క కాలనీకి కాపలాగా ఉండేది. కొత్తవారు ఎవరువచ్చినా మొరుగుతూ కాలనీ వాసులను అప్రమత్తం చేసేది. ఒంటరిగా వెళ్లే మహిళలకు తోడుగా వెళ్లేది. మార్కెట్కు వెళ్లి ఇంటికి చేరే వరకు వాళ్లను అనుసరిస్తూ వెంట నడిచేది. నమ్మకంగా ఉంటున్న ఆ శునకానికి కాలనీవాసులు ఆహారం పెట్టేవారు. ఆకలి తీర్చేవారు. ఆ శునకం.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించింది. కాలనీ వాసులు ఘనంగా కుక్కకు అంత్యక్రియలు జరిపించారు. సంప్రదాయ బద్ధంగా ఖననం చేశారు.
శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు - Nizamabad district
అప్పటి వరకు తమతో పాటు కాలనీలో విశ్వాసంగా ఉన్న శునకం ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మరణించటంపై.. కాలనీవాసులు కన్నీరు మున్నీరయ్యారు. శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Dog