వల్జీర్ సిగాటో... సాధారణంగా బాడీబిల్డర్‌గా మారాలని జిమ్‌కి వెళ్లేవాడట. అయితే 50 ఏళ్ల వయసులో ఇతను కోరుకున్న కండలు రాకపోవడంతో... సింథాల్‌గా పిలిచే నూనె, ఆల్కహాల్, పెయిన్‌కిల్లర్ల ద్రావణాన్ని కండలకు ఎక్కించుకుంటున్నాడట. దీంతో ఇతని కండలు ఇలా అయ్యాయి. ఇంతకు ముందు ఇతనో మత్తుమందు బానిస కూడా.
వామ్మో... ఇవీ కండలా... బండలా..!
ఒంటికి ఎవరో గాలి కొట్టినట్టు... బెలూన్లలా ఉబ్బిన కండలతో కనిపిస్తున్న ఇతను బ్రెజిల్‌కు చెందిన బాడీ బిల్డర్. పేరు వల్జీర్ సిగాటో. ఇదేంటి... ఇంత విచిత్రంగా కండలు పెంచాడు అనుకుంటున్నారా. అవి అలా ఇలా వచ్చిన కండలు కావు మరి. ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెబుతున్నా వినకుండా ఇంజెక్షన్లు చేసుకుంటూ... తెచ్చుకున్న కండలు..!
brezil body builder use injections for muscles
శరీరం చిక్కి శల్యమైపోయింది. ఎండుకుపోయినట్టు ఉండే అతన్ని చూసి స్నేహితులు ఎగతాళి చేసేవారట. బక్కోడు... అనే పిలుపు నుంచి ఎలాగైనా కండల వీరుడు అని పిలిపించుకోవాలని ఇలా చేస్తున్నాడట. శరీరాకృతి కోసం ఇలా చేస్తే... కండల వీరుడు అని పిలవడం పక్కనుంచి అసలు పిలవడానికే లేకుండా పోతాడేమోనని 'నెట్' జనం భయపడుతున్నారు.
ఇదీ చదవండి: చంకలో పిల్లిని పెట్టుకెళ్లొచ్చు తెలుసా..!
TAGGED:
body builder news