ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. బలవంతంగా తనువు చాలించారు! - telengana news

వివాహేతర సంబంధం.. 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పెళ్లైన ఓ వ్యక్తితో.. ఓ గృహిణికి ఏర్పడిన సంబంధం.. చివరికి బలవన్మరణానికి దారి తీసింది. తెలంగాణలో జరిగిన ఈ సంఘటన వివరాలివి.

two persons suicide with illegal affair
అవును వాళ్లీద్దరు ఇష్టపడ్డారు..వివాహేతర బంధం పెట్టుకున్నారు..తనువులు చాలించారు..

By

Published : May 16, 2020, 1:20 PM IST

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి శివారులో విషాదం జరిగింది. వివాహేతర సంబంధం బయటపడిన కారణంగా.. అవమాన భారాన్ని తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడారు. వారి కుటుంబాల్లో విషాదం నింపారు.

మాచిరెడ్డికి చెందిన నర్సింహులుకు గతంలోనే పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమారులూ ఉన్నారు. మరో మహిళకు భర్త, కుమారుడు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇరు కుటుంబాల్లో విషయం తెలిసిపోయిందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకు ఉరి వేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

డెంగీ తొంగి చూస్తోంది..

ABOUT THE AUTHOR

...view details