హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. తార్నాకలో కూడలి వద్ద జోడిపాస్కెల్, అతని ప్రియురాలు మోనికలను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారి ఏఈఎస్ అంజిరెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్, లక్షా 64వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. యమహా మోటార్ సైకిల్, నాలుగు మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు. మరో ముగ్గురు అరిక్, బెన్, ఎబుకాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.
మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్ల అరెస్టు
మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 104 గ్రాముల కొకైన్, లక్షా 64వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
two-nigerians-arrested-for-supplying-drugs
నాలుగు రోజుల క్రితం మోనికా ముంబయిలో అరిక్ నుంచి తీసుకున్న కొకైన్‌ను హైదరాబాద్ తీసుకొచ్చింది. తార్నాకలోని నాగార్జున కాలనీలో ఉంటున్న తన ప్రియుడు జోడిపాస్కెల్‌కు అందజేసింది. వీరిద్దరు కలిసి గ్రాము ఎనిమిది వేల చొప్పున యువతకు విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారని చెప్పారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు
TAGGED:
drugs case in telangana news