కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడులో...... ఓ మహిళ మరణించింది. మహిళ మృతికి.... ఆర్ఎంపీ వైద్యమే కారణమంటూ బంధువులు ఆరోపించారు. జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లామని.... వెంటవెంటనే రెండు ఇంజక్షన్లు చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తర్వాత నాగమణి కుప్పకూలిపోయి.... పావు గంట వ్యవధిలోనే కన్నుమూసిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మైలవరం ఆస్పత్రికి తరలించారు.
చీమలపాడులో మహిళ మృతి.. ఆర్ఎంపీ వైద్యమే కారణమంటున్న బంధువులు - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణాజిల్లా ఏ.కొండూరు మండలం చీమలపాడులో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న మహిళ మృతి చెందగా.. ఆర్ఎంపీ వైద్యం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
చీమలపాడులో వైద్యం వికటించి మహిళ మృతి