చిత్తూరు నగరానికి చెందిన ఉదయ్ (5), ఝాన్సీ (8) మృత దేహాలు శుక్రవారం ఉదయం ఓబనపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో తేలిన విషయం విదితమే. ఆ చిన్నారుల తల్లి బేబీ (28) మృతదేహం అదే బావిలో సాయంత్రం బయటపడింది. భర్త నుంచి విడిపోయిన ఆమె కొన్ని నెలలుగా పిల్లలతో కలసి వేరుగా జీవించింది.
ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఆమె పిల్లలతో సహా అదృశ్యమైంది. బంధువుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం ఓబనపల్లిలోని వ్యవసాయ బావిలో ఇద్దరు పిల్లలు మృతదేహాలు బయటపడ్డాయి. చివరికి తల్లి సైతం అదే బావిలో శవమై తేలింది. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.