తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు మద్యం సేవించి అత్యాచారానికి పాల్పడినట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. ఘటనా స్థలంలో మద్యం సీసాలు, బాధితురాలి వస్తువులు, నిందితులకు సంబంధించిన ఆధారాలు పోలీసులు సేకరించారు.
తెలంగాణలో దారుణం.. బాలికపై ముగ్గురి అత్యాచారం - rape attempt on minar
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పట్టణంలోని శ్రీవాణినగర్‌కు చెందిన బాలిక దుకాణానికి వెళ్తుండగా... మద్యం సేవించి కారులో వచ్చిన ముగ్గురు యువకులు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలిక చాలాసేపు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఫోన్ చేయగా... తనను అపహరించి అత్యాచారం చేసిన విషయాన్ని చెప్పింది. స్థానిక యువకులు బృందాలుగా ఏర్పడి వెతికారు. 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా... పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే నిందితులు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?