ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

పోలీసుల అదుపులో రాంప్రసాద్​ హత్య కేసు నిందితులు - accused

హైదరాబాద్​ పంజాగుట్టలో కలకలం రేపిన వ్యాపారి రాంప్రసాద్​ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంతోపాటు ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించి సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

పోలీసుల అదుపులో రాంప్రసాద్​ హత్య కేసు నిందితులు

By

Published : Jul 13, 2019, 5:27 PM IST

పోలీసుల అదుపులో రాంప్రసాద్​ హత్య కేసు నిందితులు

వ్యాపారి రాంప్రసాద్​ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంతోపాటు ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఇప్పటికే హత్యకు సంబంధించి కీలక సమాచారం రాబట్టారు. ప్రస్తుతం సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. కోగంటి సత్యం, రాంప్రసాద్ మధ్య వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

పథకం ప్రకారమే

రాంప్రసాద్​ను పంజాగుట్టలోని దుర్గానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఈ నెల 6న దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అదే రోజు మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. హత్య జరిగిన రోజు కోగంటి సత్యం పంజాగుట్ట పరిసరాల్లోనే ఉండి.... పర్యవేక్షించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య అనంతరం నిందితులు బొలెరో వాహనంలో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు... పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఇవీ చూడండి: 4 రోజులపాటు కిడ్నాప్.. చివరికి అనంతలో వదిలేశారు

ABOUT THE AUTHOR

...view details