సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఆ 21 ఏళ్ల జపనీస్ పాప్ స్టార్ ఎప్పుడూ తన ఫోటోలను అభిమానుల కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పెడుతుండేది. తన అభిమానుల్లో ఒకరైన హిబికో సాటో(26) ఎల్లప్పుడు ఆమె ఫోటోలను ఫాలో అయ్యేవాడు. సింగర్ అప్లోడ్ చేసిన సెల్ఫీ ఫోటోల్లో ఒకదానిలో అమె ఉండే స్థలాన్ని గుర్తించాడు. చూట్టూ ఉన్న ప్రాంతాన్ని చూసి గుర్తించాడనుకుంటున్నారా..? కాదు. ఆమె కళ్లలోని కనుపాపను జూమ్ చేసి గుర్తించాడు. అందులో కనిపించిన రైల్వే స్టేషన్ను చూసి గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ప్రాంతాన్ని గుర్తించాడు. అదే ప్రాంతంలో ఆ సింగర్ నివాస స్థలం అని నిర్ధారించుకున్నాడు. ఆమె వచ్చేంత వరకు నిరీక్షించాడు. బయటి నుంచి వస్తున్న ఆమెను వెనకనుంచి వచ్చి తన ఇంటి ముందు దాడికి పాల్పడ్డాడు సాటో. నోట్లో గుడ్డకుక్కి పక్కనే ఉన్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. అంతలో ఆమె తప్పించుకుని బయటపడింది. టోక్యో పోలీసులు కేసు నమోదు చేసుకుని హిబికో సాటోను విచారించగా ఈ తతంగం అంతా వివరించాడు. ప్రస్తుతం అత్యంత స్పష్టంగా వస్తున్న స్మార్ట్ ఫోన్ కెమెరాలు, పెరుగుతున్న సాంకేతికతే ఇలాంటి డిజిటల్ దాడులకు కారణమని విశ్లేషకులు అంటున్నారు.
కనుపాపను జూమ్ చేసి.. ఆమె ఎక్కడుందో గుర్తించాడు.. ఆ తర్వాత! - డిజిటల్ నేరాలు
జపాన్లో ఆమె ఓ పాప్ సింగర్.. జపాన్ ఐడల్గా అవతరించి యువతను తన స్వరంతో పిచ్చెక్కెలా చేసింది. ఇప్పుడు ఆమె అభిమానే అత్యాచారానికి యత్నించాడు. సామాజిక మాధ్యమాల్లో పెరిగిన సాంకేతికతే ఈ ఘటనకు కారణం..
japan-pop-singer-molested-by-digital-stalking