తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన ఘోరాన్ని మరవకముందే.. అదే రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై వరసకు తాత అయిన విశ్రాంత ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడడం వల్ల బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకునేలా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే...
పదో తరగతి చదువుతున్న బాలిక గర్భవతిగా వెలుగు చూడటం జగిత్యాలలో సంచలనం కలిగించింది. పట్టణానికి చెందిన ఓ బాలిక జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమెపై వరసకు తాతైన 65 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు కన్నేశాడు. బాలికను లొంగదీసుకుని లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఇటీవల తరచూ అస్వస్థతకు గురికావటం వల్ల కంగారుపడిన తల్లితండ్రులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించారు. నాలుగు నెలల గర్భవతిగా తేలడంతో హతాశులయ్యారు. అమ్మాయిని ఆరా తీయగా తాత అసలు రూపం బయటపడింది.
రివర్స్ డ్రామా ప్లే చేసిన తాత