చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న 2.2 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని సదరు వ్యక్తి హైదరాబాద్‌లో కొందరికి అందించేందుకు ప్రయత్నించాడని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.89.18 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టామని అధికారులు చెప్పారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో 2.2కిలోల బంగారం పట్టివేత - శంషాబాద్ ఎయిర్పోర్టులో 2.2కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద 2.2 కేజీల బంగారాన్ని గుర్తించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో 2.2కిలోల బంగారం పట్టివేత