బాలికను నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన తెలంగాణ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈనెల 7న బట్టలు కొనిస్తానని చెప్పి... బాలిక చిన్నమ్మ తన స్నేహితునితో కలిసి తీసుకెళ్లి గదిలో బంధించిందని బాలిక తల్లి తెలిపింది.
బాలికపై చిన్నమ్మ కర్కషం... దుస్తుల పేరుతో చిత్రహింసలు - బాలిక కిడ్నాప్ వార్తలు
దుస్తులు కొనిస్తానని చెప్పి... బాలికను నిర్బంధించి... చిన్నమ్మ చిత్రహింసలు పెట్టిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. భూవివాదం కారణంగానే కిడ్నాప్ జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
girl-kidnapped-in-miryalaguda
11 రోజుల తర్వాత బాలిక ఇంటి సమీపంలో వదిలేసినట్లు వెల్లడించింది. భూవివాదం కారణంగానే కిడ్నాప్ చేసినట్లు ఆమె భావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నామని చెబుతున్నా... నిందితులను ఇంకా పట్టుకోవడంలేదని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదీ చూడండి:వృద్ధులకు స్లాట్లు కేటాయించినట్టు వస్తున్న ప్రచారం అవాస్తవం: తితిదే