ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

శంషాబాద్​లో 48 లక్షల బంగారం స్వాధీనం

శంషాబాద్​ విమానాశ్రయంలో కిలోకు పైగా బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్​ వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా 48. 49 లక్షలు విలువగల పసిడి బయటపడింది. నిందితులు ఆధార్​ కార్డులను మార్ఫింగ్​ చేసి విమాన టికెట్లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

By

Published : Dec 6, 2019, 12:15 PM IST

శంషాబాద్​లో 48 లక్షల  బంగారం స్వాధీనం
శంషాబాద్​లో 48 లక్షల బంగారం స్వాధీనం

శంషాబాద్​లో 48 లక్షల బంగారం స్వాధీనం


హైదరాబాద్​ శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.48.49 లక్షల విలువైన కిలోకు పైగా బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గురువారం ఉదయం ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు.

నల్లటి బంతి రూపంలో..

ఇద్దరు ప్రయాణికుల నుంచి 4 దీర్ఘ చంద్రకారంలో ఉన్న నల్లటి బంతులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముద్ద రూపంలో బంగారం తెచ్చినట్లు గుర్తించి వేరు చేయగా రూ.1235.44 గ్రాముల బంగారం బయట పడింది. అదుపులోకి తీసుకున్న ప్రయాణికులను విచారించగా.. పసిడి అక్రమ తరలింపే తమ దినచర్యగా చెప్పినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యక్తి తమకు బంగారాన్ని అందచేసినట్లు పేర్కొన్నారు.

నకిలీ పేర్లతో టికెట్లు..

నిందితులు.. ఆధార్‌ కార్డులను మార్ఫింగ్‌ చేసి నకిలీ పేర్లతో విమాన టికెట్లు తీసుకున్నట్లు విచారణలో తేలిందని అధికారులు వివరించారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details