కుమార్తెను చంపాడని.. అల్లుడి తల నరికిన మామ - అల్లుడి తల నరికి చంపిన మామ వార్తలు
14:57 August 09
మామ నీ కుమార్తెను చంపింది.. నేనే అని ఆ అల్లుడు చెప్పడంతో మామకు కోపం కట్టలు తెచ్చుకుంది. అల్లారుముద్దుగా పెంచి.. కూతురిని అల్లుడి చేతిలో పెడితే. చంపేస్తాడా? అని అల్లుడి తలను నరికేశాడో మామ. తలతోపాటు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.
తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం డి.జె పురంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె చావుకి కారణం తానే అని అల్లుడు ఒప్పు కోవడంతో పల్లా సత్యనారాయణ అనే వ్యక్తి అల్లుడి తన నరికి దారుణంగా హత్య చేశాడు. గత ఏడాది సత్యనారాయణ కూమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటినుండి కుమార్తె పిల్లలు సత్యనారాయణ ఇంటివద్దే ఉంటున్నారు. రాత్రి మామ సత్యనారాయణ ఇంటికి వచ్చాడు అల్లుడు లక్ష్మణరావు. భార్యను తానే చంపినట్లు మద్యం మత్తులో ఒప్పుకున్నాడు. దీంతో అల్లుడు తల నరికి.. తలతో అన్నవరం పోలీస్ స్టేషన్లో సత్యనారాయణ లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.