ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ  ఈఎస్‌ఐ డైరెక్టర్​ దేవికారాణి అరెస్ట్ - ACB

తెలంగాణ ఈఎస్‌ఐ డైరెక్టర్​ దేవికారాణి అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్​లో అరెస్ట్ చేసింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో ఈమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు అధికారుల అరెస్టులు జరగనున్నాయి.

devika-rani

By

Published : Sep 27, 2019, 11:17 AM IST

ఈఎస్‌ఐ డైరెక్టర్​ దేవికారాణి అరెస్ట్

తెలంగాణ ....ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. సంయుక్త సంచాలకురాలు పద్మతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరికొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దేవికారాణి నివాసంతో పాటు 23 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు...కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దేవికారాణిని అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో సుమాకు 10కోట్ల మేర గోల్​మాల్ జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

ABOUT THE AUTHOR

...view details