అనిశా దాడుల్లో గూడూరు దేవాదాయ శాఖ ఈవో అక్రమాస్తులు బయటపడ్డాయి. వాటి విలువ రూ. 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
దేవాదాయ ఈవోకు 2కోట్ల అక్రమాస్తులు
By
Published : Aug 1, 2019, 1:11 PM IST
ఆదోనిలో ఏసీబీ దాడులు
కర్నూలు జిల్లా ఆదోనిలో అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేశారు. గూడూరు దేవాదాయ శాఖ ఈవో రామ్‌ప్రసాద్ ఇంట్లో జరిగిన సోదాల్లో.. రూ. 2 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. రామ్‌ప్రసాద్ భార్య పేరిట 22 ప్లాట్లు, రూ. 22 లక్షలు విలువ చేసే ప్రామిసరి నోట్లు బయటపడ్డాయి. ఆవినీతి ఆరోపణల ఆధారంగా తనిఖీలు చేపట్టామని..అనిశా డీఎస్పీ నాగభూషణం వెల్లడించారు. రామ్‌ప్రసాద్ బంధువుల సోదాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.