కరోనాపై సమాచారాన్ని ఫార్వార్డ్ చేస్తున్నారా... అయితే జాగ్రత్త... ఫేక్ మెసేజ్ చేస్తున్న వారిపై పోలీసులు ఓ కన్ను వేసి ఉంచారు. లాక్డౌన్లో భాగంగా కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారం, కేంద్ర బలగాలు వచ్చాయంటూ వైరల్ చేస్తున్న వాట్సప్ అడ్మిన్స్, యూట్యూబ్ ఛానెల్స్‌ని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 10 మందిని విచారించిన అనంతరం పోలీసులు నోటీసులిచ్చారు.
కరోనాపై తప్పడు ప్రచారం.. పది మందికి పోలీసుల నోటీసులు - కరోనాపై తప్పడు ప్రచారం
సోషల్ మీడియా ద్వారా కరోనాపై తప్పడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న వ్యక్తులను సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 10 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
త్వరలో మరికొంత మందిని విచారించనున్నట్టు తెలిపారు. కరోనాపై భయాందోళనను కలిగించే విధంగా అపోలో డాక్టర్, సీనియర్ రిపోర్టర్ సంభాషణ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు వహేబ్ను అదుపులోకి తీసుకున్నట్టు సైబర్‌క్రైం పోలీసులు వెల్లడించారు. కరీంనగర్‌కి చెందిన వహేబ్కు ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందని విచారించిన అనంతరం నోటీసులిచ్చారు. విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని పోలీసులు అతనికి ఆదేశాలు ఇచ్చారు.
ఇదీ చూడండి:కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం