ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

'దిశ' హంతకులపై నేడు మళ్లీ విచారణ - దిశ నిందితుల కోసం పోలీసులు కస్టడీ పిటిషన్​

దిశ హత్య కేసు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ తెలంగాణలోని షాద్​నగర్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉందని పిటిషన్​లో పోలీసులు పేర్కొన్నారు.

court proceedings
court proceedings

By

Published : Dec 3, 2019, 1:31 PM IST

'దిశ' హత్య కేసు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ తెలంగాణలోని షాద్​నగర్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగనుంది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు షాద్‌నగర్‌ కోర్టును కోరగా.... న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయాలని, నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు.

నిందితులను అరెస్ట్ చేసి షాద్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన క్రమంలో స్థానికులు భారీగా గుమిగూడి శాంతిభద్రతల సమస్య సృష్టించారని పోలీసులు తెలిపారు. నిందితులను హత్య గురించి ప్రశ్నించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు.

చర్లపల్లి పరిసరాల్లో 144 సెక్షన్​..

చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదన్నారు.

ఇవీచూడండి:

"పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."

ABOUT THE AUTHOR

...view details