ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన వాలంటీర్ - జగ్గయ్యపేటలో వృద్ధ దంపతుల హత్య.

couple murder
couple murder

By

Published : Dec 16, 2020, 6:29 AM IST

Updated : Dec 16, 2020, 9:23 AM IST

06:26 December 16

వృద్ధ దంపతులను హత్య చేసిన వాలంటీర్

ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన వాలంటీర్

ఆస్తి కోసం వాలంటీర్ హత్యకు పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ వాలంటీర్​గా నెమలి బాబురావు విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామంలో నివసిస్తున్న అత్తమామలు కోటా ముత్తయ్య(65), సుగుణమ్మ(60) దంపతులతో ఆస్తి వివాదం నేపథ్యంలో గత కొంత కాలంగా బాబూరావు వేధిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి కత్తితో అత్తమామల పై దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది.. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: 

నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?

Last Updated : Dec 16, 2020, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details