అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ప్రతినిధులతో రెండు రోజుల పాటు వైట్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. చర్చల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై గొప్ప పురోగతి సాధించినట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా జరగాల్సిన ప్రక్రియ చాలా ఉందని స్పష్టం చేశారు.
మార్చి 1లోపు ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదరకపోతే చైనా వస్తువులపై అమెరికా విధించబోయే సుంకంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ మరోమారు తేల్చిచెప్పారు.
ప్రతినిధుల ద్వారా ట్రంప్‌కు ప్రత్యేక లేఖను పంపారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.