మెగాస్టార్ పవర్ స్టార్ రాంచరణ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. చరణ్ బాబాయ్ పవన్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ విజయవాడ రానున్న చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతారు. ఆది, సోమవారాల్లో గుంటూరు జిల్లా తెనాలి ఎన్నికల ప్రచారంలో... పవన్‌తో రాంచరణ్ ప్రచారం చేస్తారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.
జనసేనానికి మద్దతుగా.. మెగాపవర్ స్టార్ ప్రచారం - రాంచరణ్
జనసేనకు మద్దతుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆది, సోమవారాల్లో గుంటూరు జిల్లా తెనాలి ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్‌తో కలిసి రామ్‌చరణ్ ప్రచారం చేయబోతున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.
2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం తరఫున రాంచరణ్ ప్రచారం చేశారు. మళ్లీ ఇప్పుడు బాబాయ్ పవన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. పవన్ కోరిక మేరకు జనసేనలో చేరిన నాగబాబు నర్సాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. నాగబాబుకు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాంచరణ్ జనసేన మద్దతు తెలపడం...మెగా అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. పవన్-చరణ్ కాంబో ప్రచారానికి జనసైనికులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇవీ చూడండి :ఎంపీ సీఎం రమేష్ నివాసంలో పోలీసుల సోదాలు