YOUNG MAN HULCHAL : సరైన పత్రాలు లేని కారణంగా ఓ యువకుడి బండి తాళాన్ని ట్రాఫిక్ ఎస్సై లాక్కోవడంతో.. ఆ ఎస్సై ఫోన్‌ను యువకుడు తీసుకుని వీరంగం సృష్టించిన ఘటన నంద్యాలలో జరిగింది. RTC బస్టాండ్ సమీపంలో మణికంఠ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు అతడ్ని ఆపారు. మణికంఠ సరైన బండి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు బండి తాళం తీసుకున్నారు. తాళం తీసుకోవడంతో.. ఎస్సై చేతిలో సెల్‌ఫోన్‌ను యువకుడు లాక్కొని ఇచ్చేందుకు నిరాకరించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. యువకుడి తీరుపై ట్రాఫిక్ ఎస్సై లక్ష్మయ్య ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిపైన కేసు నమోదు చేశారు.
"నా బండి తాళం తీసుకుంటావా..! ఇప్పుడు నీ సెల్ లాక్కుంటాను..!" వీడియో వైరల్ - young man hulchal with traffic si
YOUNG MAN HULCHAL IN NANDYALA : తనిఖీల్లో భాగంగా ఓ యువకుడి బండిని పోలీసులు ఆపారు. అయితే ఆ యువకుడు సరైన బండి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ బండి తాళ్లాన్ని తీసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆ ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్‌ను లాక్కున్నాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
YOUNG MAN HULCHAL
Last Updated : Dec 5, 2022, 1:50 PM IST