సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు.. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎస్గీ శివారు మంజీర నది వద్ద జరిగింది. జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు.. బోధన్ బార్డర్ ఏరియా మహారాష్ట్ర భూభాగంలోని మంజీరా నది ప్రాంతానికి వెళ్లారు. అశోక్, ప్రకాశ్.. నది లోనికి దిగి.. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు.
తెలంగాణ: ఈతకు వెళ్లి.. ఇద్దరు యువకులు మృతి - నదిలో గల్లంతు
నది వద్ద కాసేపు సరదాగా గడపడానికి వెళ్లారు ఆ నలుగురు స్నేహితులు. అందులో ఇద్దరు ఒడ్డునే నిలవగా.. మరో ఇద్దరు యువకులు.. మరో అడుగు ముందుకేశారు. లోతు ఎక్కువుందని గ్రహించేలోపే నీటిలో మునిగి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈతకు వెళ్లి.. ఇద్దరు యువకులు మృతి
స్నేహితుల సమాచారంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న మహారాష్ట్ర, బిలోలి పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల మృతదేహాలను బయటకు తీశారు. విగత జీవిగా మారిన కుమారులను చూసి.. మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఇదీ చదవండి:' క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పి.. రూ.3 లక్షలు కాజేశారు'