ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

మంగళగిరిలో దారుణం.. భర్తను కడతేర్చిన భార్య - wife killed husband with lover

Wife killed Husband : మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. మంగళగిరిలో కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చింది. వివాహమై ఏడు సంవత్సరాల తర్వాత జరిగింది ఈ హత్య. వీరికి పిల్లలూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Wife Killed Husband
హత్య

By

Published : Jan 15, 2023, 8:34 AM IST

Wife Killed Husband : గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భార్యకు ప్రియుడికి మధ్య పెళ్లికి ముందున్న సన్నిహిత సంబంధం.. పెళ్లైనా తర్వాత కూడా కొనసాగటం హత్యకు దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరికి చెందిన వింజమూరు క్రాంతికుమార్ అనే యువకుడికి ఏలూరుకి చెందిన గంగా లక్ష్మితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం కాకముందే గంగా లక్ష్మికి మరిడయ్య అనే వ్యక్తితో సంబంధం ఉందని స్థానికులు అంటున్నారు. వివాహం అనంతరం ఇది కొనసాగటంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

శనివారం అర్ధరాత్రి గంగా లక్ష్మి ప్రియుడితో సన్నిహితంగా ఉండటం భర్త క్రాంతికుమార్​ గమనించాడు. దీంతో భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య గంగా లక్ష్మి ప్రియుడు మరిడయ్యతో కలిసి భర్త క్రాంతికుమార్​ను హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. భార్య గంగా లక్ష్మి, ప్రియుడు మరిడయ్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details