విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో మద్యం దుకాణం కాపలాదారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం దుకాణం షట్టర్ ధ్వంసం చేసి చోరీ చేశారు. తమకు అడ్డు వస్తాడేమోనని అక్కడే నిద్రిస్తున్న కాపలాదారుడు సుంకరి అప్పలనాయుడిని హత్య చేశారు. అనంతరం దుకాణం సమీపంలోనే పూటుగా మద్యం తాగి పరారయ్యారు. అయితే మద్యం దుకాణంలోనే ఉన్న 5లక్షల నగదు మాత్రం దుండగులు దోచుకెళ్లలేదు. పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు.
WATCHMAN MURDERED: మద్యం దొంగతనానికి వచ్చి.. వాచ్మెన్ హత్య - WATCH MAN
దుకాణం షెట్లర్ ధ్వంసం చేసి..., మద్యం దొంగిలించారు. ఆంతటితో ఆగకుండా.. దోపిడీకి అడ్డొస్తాడేమో అన్న సందేహంతో.. కాపాలదారుడిని హతమార్చారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో చోటుచేసుకుంది.
WATCHMAN MURDERED