Two Young Boys Died: జన్మదిన వేడుకలు విషాదాన్ని మిగిల్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ యాళ్లవారిమెరకకు చెందిన రాజేష్(19)తోపాటు అతడి స్నేహితుడు ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి చనిపోయారు. రాజేష్ జన్మదినం ఆదివారం కాగా.. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి.. గ్రామంలోని సముద్రతీరంలో ఆనందంగా వేడుకలు జరుపుకున్నాడు. ముఖానికి అంటుకున్న కేక్‌ను కడుక్కునేందుకు రాజేష్, అతడి స్నేహితుడు అరవింద్ సముద్రంలోకి వెళ్లారు. ముఖం కడుక్కుంటుండగా ఉద్ధృతంగా వచ్చిన ఓ కెరటం ఇద్దరినీ సముద్రంలోకి లాక్కెళ్లింది. వీరి కోసం బంధువులు, పోలీసులు గాలించారు. మోళ్లపర్రు సమీపంలోని ఒడ్డుకు వీరిద్దరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి.
రెండు కుటుంబాల్లో విషాదం నింపిన జన్మదిన వేడుకలు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
Two Young Boys Died: ఎంతో ఆహ్లాదంగా జరిగిన జన్మదిన వేడుక విషాదంతో ముగిసింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి సముద్రతీరంలో సంతోషంగా వేడుకలు జరిగాయి. కానీ ముఖానికి అంటుకున్న కేక్‌ను కడుక్కోడానికి వెళ్లిన రాజేష్.. అతడి స్నేహితుడు అరవింద్.. ఇద్దరూ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి చనిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
విషాదం
విగతజీవులుగా తిరిగొచ్చిన బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతులు రాజేష్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. అరవింద్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష కోసం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: