ROAD ACCIDENT : రోడ్డు ప్రమాదంలో తాతా, మనవడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు అయ్యప్ప మాల విరమించేందుకు శబరిమల వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. సరిగ్గా పెదకాకాని వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాతా-మనవడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - road accident in Guntur district
ROAD ACCIDENT IN GUNTUR : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరికి చెందిన నలుగురు వ్యక్తులు శబరిమల నుంచి తిరిగి వస్తుండగా పెదకాకాని వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
accident