తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్నగురిజాలలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి.. తాత, తండ్రి, మనవడు మృతిచెందారు.
చెరువులో జారిపడి.. తాత, తండ్రి, మనవడు మృతి! - telangana news
15:28 March 13
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఘటన
గ్రామంలోని చెరువులో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన నాగరాజు(34) ప్రమాదవశాత్తు జారిపడ్డారు. నాగరాజు నీళ్లలో పడడాన్ని గమనించి, కాపాడేందుకు అతడి తండ్రి కృష్ణమూర్తి(65) చెరువులో దిగాడు. తాత, తండ్రి ఇద్దరూ కనిపించకపోవటంతో ఏం జరిగిందోనన్న భయంతో.. నాగరాజు కుమారుడు లక్కీ(12) కూడా చెరువులో దిగాడు. చెరువులో దిగిన ముగ్గురు మళ్లీ పైకి రాలేదు.
ఊపిరాడక ముగ్గురూ మృతి చెందారు. ఒకే కుంటుంబానికి చెందిన తాత, తండ్రి, మనుమడు మరణించటంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రమాదంలో మూడు తరాల వ్యక్తులు చనిపోవటంతో కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది.
ఇదీ చదవండి:Cyber Crime: నకిలీ యాప్ సృష్టించి.. నగదు కాజేసి..