Road accident in Kadapa: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన చంద్రమౌళి కడప తిలక్‌నగర్‌కు చెందిన అనురాధతో నెలన్నర కిందట వివాహమైంది. మొదటి పండగ కావడంతో భార్యాభర్తలిద్దరూ లక్కిరెడ్డిపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై కడపలోని తిలక్ నగర్లో ఉంటున్న అత్తగారింటికి బయలుదేరారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లోని నాలుగో మలుపు వద్దకు రాగానే లారీ ఎదురుగా వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరు ఎగిరి కిందపడ్డారు. కిందపడిన అనురాధ కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె కాళ్లు నుజ్జు నుజ్జై అక్కడికక్కడే దుర్మరణం చెందగా, చంద్రమౌళికి కాలు విరిగింది. గాయపడిన చంద్రమౌళిని కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు.
పండుగవేళ దారుణం... పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం..! - Telugu Latest News
Road accident in Kadapa: ఒకటిన్నర నెల క్రితం వివాహమైంది. సంక్రాంతి పండుగ కోసం ఎంతో ఆనందంగా అత్తగారింటికి బయలుదేరారు. ఇంతలోనే మృత్యువు కబళించింది. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో.. భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
పండగవేళ దారుణం... పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం